'మేం సమరయోధులమే. మీ తెల్లవారి చేతిలో చనిపోయే దుస్థితి మాకు వద్దనిపించింది. అందుకే మిమ్మల్ని నమ్మించి మహానాయకుడు బాదల్‌కు ఎదురు వెళ్లకుండా పారిపోవాలనుకున్నాం. కానీ నువు మేం రాకుంటే నలుగురు ఖైదీలని చంపుతానన్నావు. అందుకే బాదల్‌కు ఎదురెళ్ళాం. మేం తెల్లవారికి తొత్తులమై అతనిమీదకి దాడికి వస్తున్నట్లు భట్టాచార్యకు అప్పటికే వర్తమానం అందినందున మాపై బాదల్ మనుషులు తుపాకులు పేల్చారు. నేను గుండు దెబ్బతిన్న తరువాత చాలాసేపు బతికాను. అందుకే ఈ లేఖను బొగ్గుతో రాశాను. 30 గంటల ముందు మీ చేతిలో చావకూడదనుకున్నాం. అదే సమయానికి భారతీయుల చేతుల్లోనే చనిపోయాం. మా భారత్ జెండా ఎగరాలి!' - మరణానికి ముహూర్తం
ఆప్యాయంగా కోడిపుంజును అందుకుంటున్న ఉదేష్ చేతులు జారాయి. అంతే. విషం మందు పూసిన కోడికాళ్ళ గోళ్ళు డా|| జాన్ చేతిమీద గీరుకుపోయాయి. దాంతో సన్నని నెత్తుటి చారలయ్యాయి. అతడికి ఉన్నట్టుండి భగ్గుమంది. జాన్ అదిపడ్డాడు. - బతికిన న్యాయం
క్రైం, సస్పెన్స్ కలగలిపినవి ఈ కథలు.