'డాం' మని తుపాకీ పేలింది. గురితప్పని గుండు అతుర్ బోర తొడలోకి దూసుకు పోయింది. కాలిపిక్కల్లోని శక్తికొద్దీ పరుగెడుతున్న అతడి తొడలో చురచురమని కరెంట్ షాక్ లా నొప్పి ఊహించని విధంగా అటు పాదంవరకు, ఇటు నడుందాకా పాకింది. గిలగిలలాడుతూ ఆగిపోయి చేత్తో గాయం తడిమాడు... అంతే!
రక్తం ఊటలా ఎగిసిపడ్తోంది.  వెనుకనించి పోలీసులు ఉరకలు వేస్తూ వస్తున్నారు.
మరోపక్క బ్రహ్మపుత్ర నది వరద భీభత్సంతో పెద్ద శబ్దం చేస్తూ పరవళ్ళు తొక్కుతోంది.
"ఈ పోలీసులకు చిక్కితే ఎన్ కౌంటర్ చేసి మరీ ప్రాణం తీస్తారు. ఆ చచ్చేదేదో ఈ వరదనీటిలో పడి చస్తే మేలేమో!' అనుకుని ఎగిరి వరదనీటిలోకి గెంతాడు అతుల్ బోర.    పోలీసులు చూస్తుండగానే అతుల్ సుడులు తిరుగుతూ నీళ్ళలో కలిసిపోయాడు.
"వాడింక బతకడు. కొద్దిదూరంలో ఈ వరదనీరు చాలా దిగువకు జారిపడుతుంది. అదొక భయంకర జలపాతం. వీడికి తెలియదు పాపం. ఏ బండకొ, కొండకో గుద్దుకుని మరీ చస్తాడు" ఆయాసపడుతూ తోటి పోలీసులకు వివరించాడు వారి అధికారి.
ఈ సస్పెన్స్ విడాలంటే అపరాధ పరిశోధన కధలు చదవండి.
- యర్నాగుల సుధాకరరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good