''నాలుగు ఖండాల, నాలుగు సంస్కృతుల విశ్వవీక్షణం ఈ నవల. ఊహల సరిహద్దుల్ని చెరిపి, మనలో దాగివున్న ఫాంటసీ లోకాన్ని ఆవిష్కరించింది అలెండె''

''మాస్టర్‌పీస్‌ ఆఫ్‌ మాజిక్‌ రియలిజం''

''మిస్టికల్‌ వర్ణలతో, శృంగార రసోద్దీపనలతో, సున్నితమైన హాస్యం మేళవించి, కవితాత్మకంగా కథ చెప్పిన పద మాంత్రికురాలు అలెండె''

''చదవటం ప్రారంభిస్తే, కథ ముగిసిందాకా మద్యలో ఆపటం అసాధ్యమే''

''రొమాన్స్‌, పాషన్‌, అడ్వెంచర్‌..అడ్డంకులన్నీ అధిగమించి జీవిత సార్థకతకు కొత్త నిర్వచనం చెప్పిన కథానాయిక ఎలిజా సామర్స్‌''

''కాలం సరళరేఖలో పయనించదు. గతమూ, భవిష్యత్తూ సాపేక్షికమే'' అని ఒక సిద్ధాంతముంది. మార్క్యెజ్‌ కథల్లో ఈ మూడు కాలాలూ కలగలిసిన అనుభూతి కలుగుతుంది. అలెండె తన ఫాంటసీ లోకంలో కాలిపోర్నియా గోల్డ్‌రష్‌ నాటి గందరగోళం, హింస, మనుషుల వింత మనస్తత్వాలను అద్భుతంగా చిత్రించింది''

''పందొమ్మిదవ శతాబ్ది ఫ్రెంచి సాహిత్యంలో బాల్జాక్‌ సృష్టించిన 'హ్యుమన్‌ కామెడీ' నవలల్లాగే, అలెండె నవలలు ఆదునిక ప్రపంచ స్థితిగతులకు అద్దంపడుతున్నాయి.''

Write a review

Note: HTML is not translated!
Bad           Good