Rs.100.00
In Stock
-
+
జనం మనిషి : డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (డాక్టర్ రామ్) ఒక అసాధారణ వ్యక్తి. ప్రతిభావంతుడైన వైద్యుడు. మానవత్వం మూర్తీభవించిన మనిషి. కొన్ని వేల మంది పేద ప్రజలు ఆయన వద్ద ఉచిత వైద్య సేవలందుకున్నారు. లెక్కలేనంత మంది రోగులు ఆయన నుంచి ఆర్ధిక సాయం పొందారు. ఎందరో కమ్యూనిస్టులు ఆయన దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కొన్నివేల మంది ఆయన వద్ద ప్రాథమిక వైద్యంలో శిక్షణ పొందారు. ఎందరో నిరుపేదలు పోలీసు స్టేషన్కు వెళ్ళి పొందలేని న్యాయాన్ని డాక్టర్ సాయంతో సాధించుకున్నారు. ఎన్నో కార్మిక సంఘాలు ఆయన నాయకత్వం క్రింద తమ హక్కుల్ని సాధించుకున్నాయి. ఆయన బ్లేడుతో ఆపరేషన్లు చేసేవాడు. ఆయన కొందరి రోగాల్ని నయం చేసిన తీరుని ఇప్పటికీ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. మనిషిని మనిషిగా గౌరవించడం నేర్పాడు. గాంధీజీలా ఆయన జీవితమే ఆయన సందేశం.
విరాట్ : స్తెఫాన్ త్స్యైక్ గొప్ప రచయిత. 1915-16 ప్రాంతాల్లో భారతదేశానికి వచ్చి మన వేదాల్ని, పురాణాల్ని, భగవద్గీతని, తత్త్వశాస్త్రాల్ని అధ్యయనం చేశాడు. ఆ నేపథ్యంలో 'విరాట్' రాశాడు. సుమారు 40 భాషల్లోకి విరాట్ అనువదించబడింది. కొన్ని లక్షల ప్రతులు అమ్ముడుపోయాయి. విరాట్ ఒక అపూర్వ కళాఖండం, విరాట్ చదవడం ఒక గొప్ప అనుభవం.