జీవితం అంటే ప్రారంభం నుండి అంతం వరకూ అంతా అన్వేషణే కదా!

జీవితంలో బంగారు బాల్యం, అమ్మానాన్నల అమృతమయమైన ఆప్యాయతానురాగాలు, అద్బుతమైన విద్యార్థినీ దశ, ప్రేమార్ణవంగా భాసిల్లే వైవాహిక జీవితం, ఒకరికొకరుగా బ్రతికే మధుర జీవితం, భగవంతుడనుగ్రహించిన మాతృత్వ సంపద,... అన్నీ అపురూపమైనవే; జీవితాన్ని తరింపజేసేవే!

జీవితం ఎవరికైనా ఒకే తీరుగా గడవదు. సాక్షాత్తూ భగవంతుడే అయిన శ్రీరామచంద్రునికే జీవితంలో ఒడిదుడుకులు తప్పలేదు. ఆ మహానుభావునితో పోల్చుకుంటే మనమెంత!

''కాలమొక్క రీతి గడువబోదు'' అని నానుడి వుంది. సుఖాలనునుభవిస్తూ, ఆనందలోకాల్లో తేలియాడిన విధంగానే, కష్టాలనెదుర్కొని జీవితంలో ముందడుగు వేయక తప్పదు. ''జీవితం అటేనే సుఖదు:ఖాల సమ్మిశ్రితం'' కదా! జీవితం అంటేనే అన్వేషణ ప్రారంభం నుండి అంతం వరకూ!

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good