డాక్టరమ్మ సత్యానికి చెప్పసాగింది. ...
"చూడు సత్యం ! చాలా జరగరాని పొరపాటు జరిగి పోయింది. నీ భార్య యిక్కడ పురుడు పోసుకింది. కదా ! అదే రోజున జడ్జి ఆనందరావుగారి అమ్మాయి కూడా ప్రసవించింది. అదే రోజున మా వారికి హార్ట్ ఎటాక్ రావడంతో, నేను యీ రెండు కేసులూ చూడలేక నర్సులకి అప్పగించాను. ఇద్దరో సుఖ ప్రసవమే అయ్యారు. మా హాస్పిటల్ లో  పనిచేసే నర్సు కి ఆనందరావు గారి అల్లుడికి సంబంధం ఉందిట.
ఆతను ఈ నర్సు ని  పెళ్లి చేసుకుంటానని దగా చేశాడట . ఆ కోపంతో ఆ నర్సు మీ పిల్లని వారికి, వారి పిల్లాడిని మీకు మార్పిడి చేసి కసి తీర్చుకుంది. ఇందులో నీకు మేం చేస్తున్నా ఆన్యాయం ఏమి లేదు. వాళ్ళు పిల్లాడిని వాళ్లకి ఇచ్చెయ్యండి.
అవతల తన భార్య వరాలు ఆ పిల్లాడి మీదే ప్రాణాలన్ని పెతుఉకు బతుకు తోంది. మరి సత్యం ఏమి చేశాడు? వరాలు రాజీ పడిందా? తల్లి మనస్సేమిటో చిత్రించే కథ తల్లి మనసు, దీంతో ఎన్నో కథలు వున్నాయి. అవి- విడాకులు తెసుకోవాలని నిర్ణయించుకున్న ఓ ఇద్దరు భార్య భర్తలు మధ్య ఓ లాయరు రాజీ కుదిర్చే కథే అనురాగ తోరణం.
బతికి వుంది కూడా దయ్యం గా బతకాల్సి వచ్చిన ఓ అభాగ్యురాలి కథ వెలుగు వర్షం.
పెళ్లికి కావలసిది అర్ధం చేసుకునే మంచి మనసు , కష్ట సుఖాలు పంచుకునే ఆత్మీయత అని ప్రతిపాదించే కథ వకుళ . ఇలా కదా గుచ్చంలోని కథ లన్ని ఆసక్తి కరమైన ఇతి వృత్తాలతో సాగిపోయేవే. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good