"అదిగో ప్రీతి " అన్నారెవరో శరత్ గబాల్న తిరిగి చూశాడు.
అందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా , పాల నురగలాంటి
తెల్లటి దుస్తులతో , మెల్లగా మెట్లు దిగి వస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపు పచ్చటి గులాబి పువ్వు ఉంది. క్రింది హాలులో , పార్టీకి వచ్చిన ఆహాతులందరి కళ్ళూ ఆ అమ్మాయి మీదనే నిల్చినా తన కళ్ళు మాత్రం ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి. ప్రీతి పాదం ఆకరి మెట్టు మీదకి రాగానే, ఇంతలో శరత్ చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణం సేపు తదేకంగా అతణ్ణి చూసింది. ఆ తర్వాత చేతిలో గులాబిని అతనికి అందిస్తూ,తగ్గు  స్వరంతో " ,ఈ ఉత్తరానికి జవాబు ఇదే  " అంది మగసిరి నిండిన అతని చేతివేళ్లు ఆ పువ్వుని అందుకునాయి.
దూరం నుంచి ఒక వయస్సు మళ్ళిన వ్యక్తీ వీళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని ముఖం నిండా దెబ్బలు తగిలి మానినట్టుగా గాట్లూ మచ్చలూ ఉన్నాయి. మొరటుగా ఉన్న అతని పెదాలు మీద క్రూరమైన చిరునవ్వు మెదిలింది..
ప్రీతి మహీధర రావు గారి అమ్మాయి. కలిగిన కుటుంబం. శరత్ చంద్ర కు నా అనే వారెవరో లేర. పినాకపాణి అనే లాయరు దగ్గర పెరిగాడు. ప్రీతి, శరత్ చంద్ర ఒకరి నొకరు ఇష్టపడ్డారు. అయితే అకస్మాతుగా శరత్ తండ్రినంటూ జగన్నాధంరంగా ప్రేవేశం చేస్తాడు. అప్పటికే హత్యానేరం మీద జైలు శిక్ష కూడూ అనుభవించినవాడు. ఇంతకీ అతడు శరత్ చంద్ర తండ్రేనా ? శరత్ ని చంపాలని ఆతను ఎందుకు అనుకున్నాడు ? భార్య భర్తల నడుమ అనురాగం గంగానడిలా స్వచ్చంగా ఉండాలని ప్రతిపాదించే యద్దనపూడి నవల 

Write a review

Note: HTML is not translated!
Bad           Good