మల్లెమాల వేణుగోపాలరెడ్డి కథలలో అంతర్లీనంగా ఒక మానవీయ సంవేదన ఉంటుంది. స్పర్శ ఉంటుంది. అధికారం, డబ్బు, రాజకీయం, ఉద్యోగదాహం, విద్య, వైద్యం అందుబాటులో లేని పరిస్థితులు ఈ కథలద్వారా మనకు అనుభూతం అవుతాయి. మంచితనం, మానవీయగుణాలు స్వార్థం, కరుకుదనం, దుర్మార్గం, క్రౌర్యం వీటిద్వారా ఏర్పడే మానవసంబంధాలను సన్నిహితంగా పరిశీలించటంవల్ల కథకుడుగా ఆయన వైవిధ్యభరితమైన జీవితానుభవాలను కథల్ ద్వారా అందిస్తున్నారు. రైతుల కదగండ్లు, చేనేత కుంటుంబాల ఇక్కట్లు, పేదకుటుంబాలకు చెందిన ముస్లిం స్త్రీల స్థితిగతులు కథలలో అంతర్లీనంగా పడుగుపేకల్లాగా పెనవేసుకుని ఒక అమానుషమైన సమాజాన్ని మనకు దర్శింపజేస్తాయి.
- ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good