స్వర్ణాది సప్తధాతువులు, సస్తోపధాతువులు, స్థావరరూపమగు వృక్ష లతాది విషములు, జలగమరూపమగు సర్పాది విషములు, వీనిచే మానవులకు జనించెడి వికారములను శమింప జేయుటకై అనుపానమంజరి అను గ్రంథమును రచిచించెద. మఱియు యథావిథిగా జేయంబడిన సువర్ణాది సప్తధాతు భస్మంబులు, ఉపధాతువులు, వీనిచే గలుగు గుణవిశేషంబులను, యథావిధిగా జేయంబడని సువర్ణాది సప్తధాతు భస్మంబులు, ఉపధాతువులు, వీనిచే గలుగు దోషంబులకును, స్థావరజంగమ విషవికారంబులకును, శాంతులను ఆయుర్వేదాను గుణ్యముగ వచించెద.

Write a review

Note: HTML is not translated!
Bad           Good