'కూర్చున్న వాడిని కూర్చున్నట్లే వుంటాను
దేశం రంగు వెలుస్తూ వుంటుంది,
చుట్టూ పరకాయించి చూస్తాను
కొండలూ మట్టి నీళ్ళూ
సమస్తమూ రంగుతగ్గుతూ వుంటాయి,
నా లోలోపల కురస్తున్న దిగులువర్షాన్ని చేతులు చాచి తాకుతుంటాను''
మాధవ్‌  2009లో రాసిన ఇరవైయేడు పంక్తుల ఈ పద్యం చదివిన తరువాత నేను భారంగా, దిగులుగా, సాలోచనగా, మౌనంగా వుండిపోయాను. మైనస్‌ అయిదు డిగ్రీల సెల్సియస్‌ చలిలో నాచుట్టూ యెవరో వంద డిగ్రీల మంటని రాజేసి, నన్ను మరగించి, కరిగించి వేస్తున్నట్టు, అయినా వేదనలో కేక వేయడానికి కూడా నా నోరు పెగలనట్టు...! నిజమే; వెండీముల్‌ఫోర్డ్‌ అన్నట్టు అత్యుత్తమమైన, సాంద్రమైన కవిత్వం చదివిన తరువాత మనం వెంటనే మాట్లాడలేము. కాసేపు మౌనంగా వుండిపోతాము. అది ఉన్నతదశకి చేరిన కవిత్వానికి ఒక గీటురాయి. - దేవిప్రియ

Write a review

Note: HTML is not translated!
Bad           Good