Rs.80.00
In Stock
-
+
''ఇరవయ్యేళ్ళపాటు ఈ మెదడును పనిచేయకుండా ఆపెయ్యాలి'' - ఆంటోనియో గ్రాంసీ తదితర కమ్యూనిస్టుల విచారణ కోసం ముస్సోలిని ప్రభుత్వం 1927లో నెలకొల్పిన ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు ప్రాసిక్యూటర్ అన్నమాటలివి. ఇటాలియన్ కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి ఆంటోనియో గ్రాంసీ. మొదటి ప్రపంచయుద్ధానంతురం మొదలైన 'ఫ్యాక్టరీ కౌన్సిళ్ళ' ఉద్యమంలో, ముఖ్య రాజకీయ పోరాటాలలో ఆయన పాల్గొన్నారు. 1926లో ఫాసిస్టు ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. తీవ్రంగా జబ్బుపడి జైలు నుండి విడుదలైన కొద్దిరోజులకే 1937 ఏప్రిల్ నెలలో ఆయన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం నలభయ్యారేళ్ళు. జైలులో ఆయన రాసిన సుమారు 3,000 పేజీలతో కూడిన 34 'నోట్‌బుక్స్' భావితరాలకు మిగిలిపోయాయి.
పేజీలు : 106