ప్రేమ తత్వాన్ని ఔత్సాహిక, పరిణత దశలతో పోలుస్తూ.. నిజమైన ప్రేమ లోతును తెలియజేస్తూ 'నువ్వు నాకు కావాలి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను' దశ నుండి 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు కావాలి' స్థితి వరకు ఎదగమని ప్రఖ్యాత జర్మన్‌ మానసిక శాస్త్రవేత్త ఎరిక్‌ ఫ్రాం అన్నాడు.

ఔను.. ప్రేమ అగ్ని... హిమాగ్ని.. అదృశ్యంగా దహిస్తూ, వ్యాపిస్తూ, ఆక్రమిస్తూ, రహిస్తూ, రమిస్తూ అంతిమంగా జీవమై, ప్రాణమై, ఊపిరై చంచలించేదీ.. జీవితానికి పరమార్ధాన్ని చేకూర్చేదీ కూడా. అందుకే మహాత్మా గాంధీ అతి సరళ భాషలో 'ప్రేమ ఉన్నచోటనే జీవితం ఉంటుంది' అని సిద్ధాంతీకరించాడు.

శివపురాణంలో శివుడు 'ప్రేమే శక్తి' అన్నాడు.

ఐతే అసలు ఈ ప్రేమ ఏమిటి? ఎవరిమధ్య ఎటువంటి ప్రేమ ఉండాలి. స్త్రీ పురుషుల మధ్య... తోబుట్టువుల మధ్య.. స్నేహితుల మధ్య.. తల్లిదండ్రుల మధ్య.. గురుశిష్యుల మధ్య.. ఈ రకంగా ప్రేమ అనంతమై, అఖండమై, అరూపమై, అవిభాజ్యమై.. యుగయుగాలుగా అనాదిగా మనిషిని.. మానవేతర సకల చరాచర జీవరాశిని సృష్టి 'ప్రేమ' అనే మహామాయతో శాసిస్తూనే ఉంది. మాయ, మిథ్య, భ్రాంతి వంటి అనుక్షణిక ఉద్వేగ ప్రచలనాలతో మనిషి కాలాన్ని వేటాడుతూ, కాలం మనిషిని వేటాడుతూ.. 'ప్రేమ' ఒక నిరంతర అనంత జీవానుభవ అన్వేషణై కొనసాగుతూనే ఉంది.

అసలు మనిషికి ఏం కావాలి... ఎంత ప్రేమ కావాలి.. ఈ ప్రేమదాహానికి ఒక అవధీ అంతమూ అనేది ఉందా.. ఉంటే ఎంత.. ఎక్కడివరకు.. ఎప్పటివరకు?

చూద్దాం ఒకసారి తొంగి.. ఈ అత్యాధునిక సమకాలీన జీవితాల్లోకి.. పదండి..

- రామా చంద్రమౌళి

Pages : 199

Write a review

Note: HTML is not translated!
Bad           Good