అందరిలా కాకుండా కొందరిలాగుండాలనే ఆరాటముతో గత నాలుగు దశాబ్దాల నుండి కధలు రాస్తున్నాను. రాశితో పాటు వాసి పెరగాలనే పట్టుదల పెనవేసుకు పోయింది. తెలుగు కధా దిగ్గజాలైన అన్ని ప్రాంతాల రచయితలతో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను, భావాలు ఇచ్చి పుచ్చుకున్నాను.
సమకాలీన సమాజములోని మానవ జీవితాలను పలు కోణాల్లో దర్శించి, దేశకాల పరిస్థితుల్ని మేళవించాలనే ఆశయముతో కధలు రాస్తున్నాను.
మంచి సాహిత్యాన్ని సమజాని కందించాలనే సదాశయముతో "తెలంగాణ కధలు" లో నేను రాసిన  "కలికి గాంధారి" కధను రాయటం జరిగింది.
అదే క్రమములో నేను రాసిన మరో 20కధలతో ఈ "అంతర్నేత్రం" కధా సంపుటిని మీకందిస్తున్నాను.
ఇందులోని కధలు పలు పత్రికల్లో కనిపించినవే. దేశాన్ని కలవరపెడుతున్న కాశ్మీర్ సమస్య, దళిత పురోగతి, కులాలపేర సంకుల సమరం లాంటి ఎన్నో అంశాలను ఈ కధల్లో స్పృశించడం జరిగింది.--- ఐతా చంద్రయ్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good