ట్రాఫిక్‌ ఐలాండ్‌ దగ్గర రెడ్‌సిగ్నల్‌ పడటంతో సిగరెట్‌ కాలుస్తూ, అటూ ఇటూ చూస్తున్న అక్షిత్‌ని - ఆయన పక్కనే స్కూటర్‌ ఆపి, గ్రీన్‌సిగ్నల్‌ కోసం చూస్తున్న ఓ పేపర్‌ జర్నలిస్టు చూసాడు. ''ఎన్‌.పి.సాబ్‌-మీ కోసమే, మీ ఆఫీసుకొస్తున్నాను'' ఆ మాట వినబడటంతో తలప్రక్కకు తిప్పి చూసాడు ఎస్‌.పి. ''ఏమిటీ'' అడిగాడు అక్షిత్‌. ''ఏమిటంటారేమిటి సార్‌! ఆ సాయబు మెట్ట దగ్గర మర్డర్స్‌ జరిగిపోతుంటే.... అక్కడ పరిస్థితి దారుణంగా ఉందిసర్‌'' - జర్నలిస్టు జయరామ్‌ ఏమంటున్నాడో ఒక్క క్షణం అర్ధంకాలేదు. ''మర్టర్స్‌.. ఎందుకు..... అసలేవైంది'' ఏదో అనుమానం వచ్చింది ఎస్‌.పి.కి గ్రీన్‌ సిగ్నల్‌ వెలిగింది.

''నేను మా ఫోటోగ్రాఫర్‌ కోసం వెళ్తున్నాను. తర్వాత కలుస్తాను. నేనెలాంటి న్యూస్‌ రాసినా మీరేమనగూడదు. ఓ.కే... అక్కడేం జరుగుతుందో తెల్సుకోవాలంటే - మీకు రెండు నిమిషాలు చాలు. అవునుకదా... సీయూసర్‌'' ముందుకెళ్ళిపోయాడు జర్నలిస్టు జయరామ్‌. 'గేరు' మారుస్తున్న డ్రైవర్‌ వేపు చూసాడు అక్షిత్‌. ''కలెక్టరాఫీసుకు కాదు. మనాఫీసుకు పోనీ....'' మరో ఐదు నిమిషాలకు కాదు ఎస్‌.పి. ఆఫీసు ముందాగింది.

''త్రీ టౌన్‌ సి.ఐ.ని నాతో మాట్లాడమని చెప్పు'' నర్సింహానికి చెప్పి తన ఛాంబర్‌కి వెళ్ళాడు అక్షిత్‌. ''సి.ఐ. రామ్మూర్తి స్టేషన్లో గాని, సాయిబుమెట్ట దగ్గర కానీ లేడు సర్‌'' చెప్పాడు నర్సింహం. ''సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నాడా'' ''ఉన్నాడు సర్‌'' సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లైన్‌లో కొచ్చాడు. ''సార్‌-నేనే మిమ్మల్ని కాంటాక్ట్‌ చేద్దామను కుంటున్నాను సర్‌. ఎమ్మెల్యే కృష్ణదాసు మనుషులు గుడిసెవాసుల మీద దాడి చేసారు సర్‌. వాళ్ళూ వీళ్ళూ తీవ్రంగా కొట్టుకున్నారు సర్‌. యాభైమందికి సీరియస్‌గా ఉంది సర్‌'' చెప్పుకు పోతున్నాడు. అసలేం అర్ధం కాలేదు ఎస్‌.పి.కి.

''అక్కడలా ఛస్తుంటే, మీరే చేస్తున్నారయ్యా, ఆ సి.ఐ., ఆ పోలీస్‌ ఫోర్స్‌ ఏం చేస్తోంది'' కోపంగా ప్రశ్నించాడు అక్షిత్‌. ''మన వాళ్ళందరూ తిరిగొచ్చేసార్‌ సర్‌. కృష్ణదాసు ప్రొటెక్షనేం అఖర్లేదన్నాడట''. ''వాడెవడయ్యా'' ప్రొటెక్షన్‌ అఖ్ఖర్లేదనడానికి సి.ఐ.ఏం చేస్తున్నాడు ? ఎక్కడ తగలడ్డాడు ? అసలక్కడేం జరుగుతుందో అర్జంటుగా పూర్తి డిటైల్స్‌ కావాలి''. ఎమ్మెల్యే కృష్ణదాసు మనుషులు గుడిసెవాసుల మీద దాడెందుకు చేసారు ? దాని పర్యవసనాలేమిటి ? - తెలుసు కోవాలంటే శ్రీ సూర్యదేవర రామ్‌మోహన్‌రావు గారు రాసిన నవల 'అంతర్యుద్ధం' చదవండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good