మనం ఏ చెడ్డ పని చేస్తున్నా వద్దని వారించే ఓ అంతరాత్మ మనందరిలో ఉన్నట్లే, ఈ ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలు, అనుభవాలు, విషయాల నించి గోప్యంగా మనకి పాఠాలని బోధించే ఓ అంతర్వాణి కూడా మనందరిలో ఉంది.  ఆ వాణిని మనం అర్థం చేసుకోగలిగితే, దానికి ట్యూన్‌ అవగలిగితే అప్పుడు ప్రపంచంలోని ప్రతీ సంఘటన, ప్రతీ సమాచారం, అనుభవం మనల్ని దైవం వైపు నడిపిస్తుంది.  అందుకు ఆ అంతర్వాణిని మించిన మంచి గురువు మరొకడు ఉండడు.  ఈ పుస్తకంలోని అలాంటి సమాచారాలని, పాఠాలని సామాన్య పాఠకులు సరదా, కాలక్షేపం కోసం చదవచ్చు.  ఆథ్యాత్మిక పాఠకులకి అవి నిస్సందేహంగా కొత్త కోనాలని ఆవిష్కరిస్తాయి.  అనేక ఆథ్యాత్మిక పుస్తకాలని రాసిన మల్లాది వెంకటకృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ తాజా పుస్తకం అంతర్వాణి

Write a review

Note: HTML is not translated!
Bad           Good