గతంలో ఆత్మకథలు చాలా వచ్చాయి. అయితే ఈ పుస్తకంలో కనపడే విశిష్టత రచయిత నిజాయితీ...! పుస్తకం కమర్షియల్‌గా సక్సెస్‌ అవటం కోసం పేరున్నవారిని తిట్టటం, వారి బలహీనతల్ని భూతద్దంలో చూపటం, వారితో తన అనుభవాల్ని డ్రమటైజ్‌ చేస్తూ తనని తాను అంతర్లీనంగా పొగుడుకోవటం మొదలైనవి ఇందులో కనపడవు.

    సమాజానికి కాస్త సేవ చేద్దామన్న ఒక రిటైర్డ్‌ పోలీసు ఆఫీసరు ఉద్దేశ్యాన్ని కొందరు ఎలా అపార్థం చేసుకున్నారన్న ప్రారంభం నుంచీ, రాజకీయ వైకుంఠపాళీలో నేర్చుకోవలసిన పాఠాలవరకూ వ్రాసిన ఈ పుస్తకం, రాజకీయాల్లో చేరాలనుకునేవారికి ఒక పాఠ్యాంశంగా చరిత్రలో నిలిచిపోతుంది.

    ఈ పుస్తకంలో మరొక గొప్పతనం - పాజిటివ్‌నెస్‌.

    కప్పగంతులు, పిల్లిగెంతులూ చేయకుండా ఒకే పార్టీలో ఉంటే, ఎప్పటికైనా అది ఫలితాన్ని ఇస్తుందన్న పాజిటివ్‌ దృక్పథాన్ని 'యువ' రాజకీయ నాయకులకీ, వ్యవస్థ పట్ల నమ్మకాన్ని మనలాంటి సాధారణ పాఠకులకి ఇచ్చిన ఈ రచయిత అభినందనీయుడు.

- యండమూరి వీరేంద్రనాథ్‌

    ఈ పుస్తకం అద్భుతం, అపూర్వం! ఎన్నో నగ్న సత్యాలను వెల్లడించిన పుస్తకం. మీ వ్యక్తిత్వాన్ని నిలువుటద్దంలో చూపించే పుస్తకం. ఎందుకంటే ఇదొక చారిత్రకమైన రచన కాబట్టి. ఎందరికో గుణపాఠం చెప్పే రచన కాబట్టి. ఇది నవలా? పరిశోధక నవలా? వాస్తవ చిత్రీకరణ నవలా? రాజకీయ నవలా?... అంటే అన్నీ సంగమించిన నవల లాంటి రచన అనాలి.

- ద్వానా శాస్త్రి

    అద్భుతంగా వుంది. ఆసక్తికరంగా చదివించింది.

    కాలం గడిచినకొద్దీ వన్నె పెరుగుతుంది.

- వేమూరి బలరాం, స్వాతి

Write a review

Note: HTML is not translated!
Bad           Good