శ్రీశ్రీ లేనిలోటు భర్తీ చేయలేనిది - దుక్కిపాటి మధుసూదనరావు

మహాకవి శ్రీశ్రీ నాకే కాదు, మా అన్నపూర్ణ సంస్థకి కూడా ఎంతో ఆత్మీయులు. ఒక్క ''దొంగరాముడు'' చిత్రం మినమాయిస్తే అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటి లోనూ శ్రీశ్రీ పాటలు రాశారు.

''కలకానిది, విలువైనది బ్రతుకు

కన్నీటి ధారలలోనే బలిచేయకు-!''

వేదాంతాన్ని మధించి రాసిన పాట ఇది.

అలాగే అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచే పాట -

''పాడవోయి భారతీయుడా

ఆడి పాడవోయి విజయగీతికా ''

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను ఆయన రాశారు. అవి అన్నీ అన్నపూర్ణాసంస్థ నిర్మించిన చిత్రాలలోనివి కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం...... 

పేజీలు : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good