1995 - 96లో ఆయన ఉద్యమం మహారాష్ట్రలో శివసేన, బి.జె.పి. ప్రభుత్వం ఇద్దరు అవినీతి మంత్రులను తొలగించాల్సి వచ్చింది. 2003లో కాంగ్రెస్‌ నేషనల్‌ పార్టీ ప్రభుత్వం నలుగురు మంత్రులపై విచారణకు ఆదేశించడానికి అన్నా ఒత్తిడే కారణం. శరద్‌పవర్‌, బాల్‌ థాకరే వంటి నాయకులు అన్నా ఉద్యమ శైలిని 'బ్లాక్‌ మెయిల్‌'గా అభివర్ణించారు. దీనిని బ్లాక్‌ మెయిల్‌ అనుకున్నా మంచి మార్పుల కోసమే జరిగింది. ప్రారంభంలో సాధారణంగా జరిగినా తరువాత ఉద్యమం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.

అవినీతి ఉద్యమంలో ఇప్పుడు అన్నా ఒంటరి కాదు. సామాన్య పౌరులు, ప్రసిద్ధ వ్యక్తులు కూడా ఆయనను సమర్ధిస్తున్నారు.  ఎక్కడ చూసినా అన్నాయే. అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ అన్నాయే. అన్ని నెట్‌ వర్క్‌లోను ప్రజలు అన్నాకు అనుకూలంగా తమ వాణిని వినిపిస్తున్నారు.

అన్నా ఒక ఉద్యమం నుండి మరో ఉద్యమంలోకి అవిశ్రాంతంగా పయనిస్తున్నారు. సమాచార హక్కు కోసం బెబ్లుఇలా గర్జించారు. పౌర సమాజ ప్రముఖులు రూపొందించిన 'జన్‌ లోక్‌ పాల్‌ బిల్లు'కై పోరాడుతున్నారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good