పుస్తక పఠనం నా అలవాటు. మంచి పుస్తకాలు, పత్రికలలో మంచి విషయాలు కంటపడితే ఒక పుస్తకంలో దానిని గుర్తువేసుకోవడం. తరువాత కాలంలో వాటిని మరల మరల చదువుకోవడం కూడా అలవాటు. ఆ విధంగా మంచి పుస్తకాలు, పత్రికలనుంచి సేకరించినవే ఈ చిన్న పుస్తకంలోని యధార్ధ కథా చిత్రాలు.

ఇందులో 41 కథలకుపైగా కొన్ని విపుల మాస పత్రికలో 'అనగనగా' శీర్షిక కింద, మరికొన్ని చతుర మాస పత్రికలో 'నిన్నటి నిజం' అనే శీర్షిక కింద ప్రచురితమయ్యాయి.

ఇందులోనివి కథలు కావు. కథలంటే కల్పితాలు. ఇవన్నీ నిజంగా జరిగినవే. అందుకే ఇవి యధార్థ కథా చిత్రాలు. వీటికి ఒక ఫ్రేం, స్కీం, ధీం ఏమీ లేవు. ఉన్నది ఒకటే. పెద్దల అడుగుజాడలు, మనకు పఠనార్హాలు, మార్గదర్శకాలు. ఈ దృష్టి కోణంతో పాఠకులు చదివి లాభం పొందితే అదే పదివేలు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good