కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల పండుగని గత ఏడాది ఘనంగా చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ చరిత్ర రాయిస్తే  సందర్భోచితంగా ఉంటుందని భావించాను. ఆ పని చేయగలిగే ఏకైన వ్యక్తీ నాకు వెంకట రామారావు గారొక్కరే కనిపించరు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపైన అయన అనేక పుస్తకాలూ, వ్యాసాలు వెలువరించి ఉన్నారు. వారి వద్దకు వెళ్లి, నా ఆలోచనని చెప్పగానే వారు సంతోషంతో అంగీకరించారు.
తెలుగు నేలమీద నడిచిన కాంగ్రెస్ చరిత్రని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చరిత్ర పేరుతొ ఒక గ్రంధాన్ని రచించిన ప్రముఖ చరిత్ర కారులు, పాత్రికేయులు శ్రీ జి.వెంకట రామారావు గారి అపారమైన కృషి అభినందనియమైనది. ఎంతో పరదర్సాకతతో సునిశిత దృష్టితో వారు ఈ గ్రంధాన్ని రచించారు.
తెలుగు వెలుగుల్లో కాంగ్రెస్ పటిష్టమైన, ధగద్ధయమానం కావాలంటే కాంగ్రెస్ వాదులు తోటి కాంగ్రెస్ వాదుల్ని గుర్తించి గౌరవించి ఐక్యంగా అలవాటు చేసుకొని తీరాలని ఈ గ్రంధంలో కనిపించే చారిత్రక సత్యాలు పాఠాలు నేర్పుతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good