ఆంధ్రప్రదేశ్‌ ప్రజాతీర్పు
టిడిపికి కలసి వచ్చిన రాష్ట్ర విభజన - ముఖ్యమంత్రిగా మరోసారి రికార్డు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.  ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం మద్దతు ఇచ్చినప్పటికీ, సీమాంధ్రలో మాత్రం తెలుగుదేశం నాయకులు దానిని వ్యతిరేకించారు.  పార్టీ పరంగా వ్యతిరేకించకపోయినా, ప్రచారంలో మాత్రం ముందంజలో ఉన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ కేవలం కొత్తగా వచ్చిన వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల కోసం విభజన చేసిందని ప్రచారం చేయగలిగారు.  విభజన తర్వాత ఏపీలో అత్యంత సీనియర్‌ నాయకుడిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిలిచారు.  దానికి తోడు జాతీయ స్ధాయిలో భారతీయ జనతా పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకోవడం కలిసి వచ్చింది.  మోడీ ప్రభంజనం బాగా పనిచేయడం టిడిపికి బాగా ఉపయోగపడింది.  మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి అభివృద్ధి చేయగలుగుతారని ప్రజలు నమ్మారు.  అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోకుండా అన్ని వ్యూహాలు అమలు చేశారు.  కాంగ్రెస్‌ నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలందరిని టిడిపిలో చేర్చుకున్నారు.  ప్రముఖ సినీనటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్‌ కళ్యాణ్‌ మద్దతు కూడగట్టడంలో సఫలం అయ్యారు.  దాంతో సామాజిక సమీకరణలను మార్చివేశారు.  వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే సామాజిక వర్గాలలో చీలిక తేవడంలో సక్సెస్‌ అయ్యారు.  అంతేకాక వాగ్దానాల పరంపరంలో ఏ ఒక్కదానిని విడిచి పెట్టలేదు.  సాధ్యమా? కాదా అన్న దానితో నిమిత్తం లేకుండా విజయమే పరమావధిగా చేసిన ఆయన ఎన్నికల హామీలు కూడా బాగా ఉపకరించాయి.  అందులో రైతుల రుణమాఫీ హామీ అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.  రైతు వర్గాలలో మార్పు తెచ్చుకోవడంలో చంద్రబాబు సఫలం అయ్యారు.  అయినప్పటికీ వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి.  టిడిపికి 102 స్థానాలు వస్తే, మిత్రపక్షమైన బిజెపికి నాలుగు స్థానాలు వచ్చాయి.......

Write a review

Note: HTML is not translated!
Bad           Good