చాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో ఉంటాయి. కాని మానవత్వం సుగ్గుపదవలసిన సంఘటనలు అరుదు. డబ్బే జీవితంగా భావించి భవానీ ప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జీవచ్చావంగా మార్చిన ఆ సంఘటన ఏమిటి ? షేమ్ కథ చదవండి. తెలుస్తుంది.
నిరుద్యోగం కలిసి రాణి పరిస్థిలు గోపాలాన్ని పిప్పి చేశాయి. అసమర్దుదని అందరూ వేలెత్తి చూపారు. తనకి జరిగిన అవమానాలెన్నో సహించిన గోపాలం, శాంతికి జరిగిన అవమానాన్ని సహించలేక పోయాడు. అగ్ని జ్వాలల జ్వలించాడు . ఫలితం ఏమిటో, ఏం జరిగిందో తెలిపే కథ - అసమర్ధుడు.
ఆర్ధిక అసమానతలతో పెద్దవారి అధికారానికి బానిసల్లా బతుకులు వెళ్ళదీస్తున్న బడుగు బతుక్ల్లో రోజు రోజుకీ దిగజారుతున్న తన గ్రామం  ఒక వైపు జీవితాన్ని సుఖప్రదంగా , మూడు పువ్వులూ ఆర్ కాయలుగా మార్చగలిగిన విదేశీ జీవితావకాశం ఒక వైపు రవి ఏ మలుపు తిరిగా డో  తెలుపుతూ, ఈనాటి యువతరానికి దారి చూపించే  కథ - ఆంద్ర యువకుడా ! దారి ఇటు .

అనుకోని పరిస్తితులేడురై , భార్యాన్ని చెప్పుకోలేక పోయినా , భర్తనే అంటిపెట్టుకుని జీవితాన్ని జయించిన జయ కథ. - భార్య.
ప్రతి పదం దృశ్యంలా కదిలేలా రాసిన కథలు రెండైతే. విస్తృతమైన కదా సారాన్ని సంఘటనల్లా మలచి కూర్చిన కథలు రెండు. రచనా విధానంలో మార్పుని, రస స్పందన కలిగించటంలో నేర్పని అవగతం చేసుకోవటానికి తప్పక చదవాల్సిన యద్దనపూడి సులోచనారాణి గారి కదల సంపుటిది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good