మన పెద్దలు , అనుభవజ్ఞులు యద్బావంతద్భావతి అంటూంటారు అంటే, మనసులో ఏయే భావాలు ఉంటాయో అవే సాకారమవుతాయని అర్ధం. అందువలనే ఆలోచనలను ఉన్నత స్థాయిలో పాజిటివ్ గా చేయమంటారు. విద్యార్ధి దశ నుంచే మంచి ఆలోచనలు, ఉన్నత భావాలు లకిగి ఉండాలి. అందుకు సమాజంలోని ఉన్నత వ్యక్తుల, ఆదర్శ మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం చాలా అవసరం. మన ఆంధ్ర ప్రదేశంలోని వివిధ శాస్త్ర రంగాలలో విజేతలైన పరిశోధకుల , శాస్త్రవేత్తల, నిపుణుల జీవిత పరిచయాలు వారి కృషిఫలాలను ఈ గ్రంధంలో పొందు పరచడమైనది . జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మూడు తరాల ప్రసిద్ద ఆంధ్ర శాస్త్రావేత్తల సంక్లిష్ట జీవిత సమాహారమే ఈ గ్రంధం రూపం మన తెలుగునాట జీవిత చరిత్రల గ్రంధం రచనలో నిష్టాతులైన ప్రసిద్ద సినియర్ పాత్రికేయులు కెరీర్ స్పెషలిస్ట్ శ్రీ శ్రీవాసవ్య గారు రచించిన ఈ గ్రంధం విద్యార్ధిని -విద్యార్ధులకు యువతరానికి, భావితరానికి స్పూర్తిని రగిలింస్తుందని విస్వసిస్తున్నాము. మేము ఒక సామాజిక భాద్యతగా ఎంచి ప్రచురించిన ఈ గ్రంధం తెలుగుజాతి శాస్త్ర ప్రపంచంలో ఒక వెలుగు కిరణం వలే భాసిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూన్నాం.
Rs.200.00
In Stock
-
+