ఆంధ్రప్రదేశ్‌ ఏపీపీఎస్సీ గ్రూప్స్‌ కొత్త సిలబస్‌ (ప్రత్యేకం)

రాష్ట్ర విభజన సమస్యలు కొత్త సిలబస్‌గా రూపొందించారు.

1. ఆర్థిక సమస్యలు 2. ఉద్యోగ విభజన సమస్యలు 3. నదీ జలాల వివాదం 4. న్యాయ సమస్యలు 5. విద్యా సంస్థల వివాదాలు, ఇతర అంశాలు.

నేను 2003 విస్సన్నపేటలో ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టరుగా పనిచేస్తున్న రోజులలో మాకు తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలికి, ఇప్పటి చంద్రబాబుకు పోలిక లేదని నా వ్యక్తిడద అభిప్రాయం. అప్పటి చంద్రబాబు అంటే ఉద్యోగులంతా గడగడలాడేవారు. ఆయన ఏ జన్మభూమి సభకు హాజరవుతాడో, ఎవరిని ఏ వివరాలు అడుగుతాడో, ఆయన ఆదేశాలిచ్చిన పనులు పూర్తిగాకపోతే జన్మభూమి సభలో ఆర్‌.డి.ఓ. మొదలు యం.ఆర్‌.ఓ.; యం.డి.వో., ఇతర అధికారులలో ఒకరకమైన టెన్షన్‌ వాతావరణం ఏర్పడేది. నేను హాజరయిన కొన్ని జన్మభూమి సభలలో కొంతమంది అధికారులకు చీవాట్లు తప్పేవి కావు. అప్పటికి ఇప్పటికీ రాజకీయాలు పూర్తిగా మారిపోయిన మాట వాస్తవం.

సమర్థత ప్రాతిపదికగా ప్రజలు తనకు కట్టబెట్టిన నమ్మకం వమ్ముకాకుండా చూసుకోవడానికి చంద్రబాబుకు ఉన్నది ఆ సమర్థతే. ఆంధ్ర ప్రజానీకం ఆయనపై పెక్కు ఆశలు పెట్టింది. ఈయన కాలంలో రాజధాని అద్భుత నగరం తయారవుతున్నది. పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కావు అని 100% మంది ప్రజలు నమ్ముతున్నారు. వారి కళ్ళ ఎదుటే అమరావతి రాజధాని ప్రకటన, స్వచ్ఛందంగా సాగుభూములిచ్చిన అమరావతి రైతులు, అమరావతి శంకుస్థాపన, కృష్ణా గోదావరి నదుల కలయిక ఇవి చాలు ఆయన పనితనానికి రుజువు. వేరే రుజువులు అక్కరలేదు. కావున రచయితగా నేను కోరుకునేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారిలో అలనాటి పాత చంద్రబాబుని చూడాలని అధిక శాతం కోరుకుంటున్న వారిలో నేను ఒకడిని. ఇప్పుడు విద్యార్థిలోకం ఆండ్రాయిడ్‌ ఫోనులు, బైకు రేసులలో చూపిన శ్రద్ధ మనం నివసిస్తున్న రాష్ట్ర మీద ఆలోచన చేయండి. మన రాష్ట్రం మనం ఎలా అభివృద్ధి చెందాలని దృష్టి పెట్టండి. ఇప్పుడు చంద్రబాబు గారి సూచనల ప్రకారం ఏపీపీఎస్సీ సిలబస్‌లో ఇప్పటి రాష్ట్ర విభజన పరిస్థితులు ప్రవేశపెట్టడం వలన యువత దృష్టి పెట్టే అపూర్వ అవకాశం వచ్చింది.

- రచయిత

Pages : 103

Write a review

Note: HTML is not translated!
Bad           Good