నేటికి సుమారు 70 సంవత్సరాల క్రితమే 'ఆంధ్ర రాష్ట్ర మహిళ సంఘం' ఏర్పడటం; ఒక స్పష్టమైన దృక్పథంతో ప్రణాళికను, నిబంధనావళిని రూపొందించుకోవటం; వేలాది మంది మహిళలు పిల్లా పాపలతో ఈ సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం; సభలకు హాజరు కావటం; ఊరేగింపులో కదం తొక్కటం; అనేక రాజకీయ అంశాల మీద తీర్మానాలు చేయటం; ఇతర సంఘాల పట్ల తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించుకోవటం - ఇందంతా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎంత కర్తవ్య దీక్షతో, ఎంత ఆశయ నిబద్ధతతో మహిళా ఉద్యమం రూపుదిద్దు కొన్నదో అర్థమవుతుంది.

సంఘటిత మహిళా ఉద్యమాన్ని నిర్మించటానికి ఈ వెలువైన అనుభవాలను నేటి తరం ఉపయోగించుకోగలగాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good