ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర, సంస్కృతీ - 1

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాక్చారిత్రక యుగం నుండి చారిత్రక యుగావిష్కరణ వరకు జరిగిన అనేక పరిణామాలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. భౌగోళికత, పర్యావరణం, ప్రాచీన, మధ్య, శిలాయుగాల్లో జనావాస జీవనాధార శైలులు, శిలపై కళ మొదలయిన అంశాలు, మానవుడు ఏ రకంగా తననుతాను నిలవరించుకోవడానికి, తన ఆహారవ్యవస్ధను తీర్చిదిద్దుకోడానికి, తనలో నిబిడీకృతమైన ప్రకృతి పర్యాలోకనను కళారూపంలో అభివ్యక్తీకరించడానికి ఏ రకమైన కృషి చేశాడో, సాంద్ర అటవీ ప్రాంతాలు, నిరంతర జల ప్రవాహాసహిత నదీ పరీవాహిక ప్రాంతలు, ఇసుకరాయి, సున్నపురాయి, గ్రానైట్‌ వంటి వివిధ శిలా విశేషాలు విస్తరించిన ప్రాంతాలు, నిర్ణాయక అంశాలుగా మారినవో సహేతుకంగా, సాధికారికంగా వివరించడమైంది. బృహచ్చిలా యుగపు సమాధులకు ఇచ్చిన విశేషమయిన వివరణ. మానవుల్లో బహుళంగా కన్పించే మరణానంతర నమ్మకాలకు ఆంధ్రదేశంలోని అన్ని ప్రాంతాలూ ఏ విధంగా దర్పణం పడుతున్నదీ వివరించడమైంది. రాబర్ట్‌ బ్రూస్‌ ఫుట్‌, బర్కిట్‌ మొదలుకొని వెంకట సుబ్బయ్య, చంద్రమౌళిల తరం వరకూ గల అన్ని పరిశోధనలను యీ సంపుటం వివరిస్తుంది.

సాధికారికతకు, ప్రామాణికతకు, వ్యాఖ్యాన సౌష్టవానికి, సంప్రదాయ శైలీసమన్వయానికి యీ గ్రంథం శాస్త్రీయమయిన ఉదాహరణ. సమగ్రాంధ్ర పాఠకలోకం గతంలోకి, మానవ నాగరికతా పరిణామంలోకి తొంగి చూడడానికి యీ పరిశోధన గ్రంథం ఉపకరిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good