నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయరంగ ఉత్పత్తి ప్రక్రియ చాలావరకు సన్నచిన్నకారు రైతులపై ఆధారపడి వుంది. ఇంకా చెప్పాలంటే అత్యధికంగా గల కౌలు రైతులపైనే ఆధారపడి వుందని చెప్పడం సబబు. అందుకని కౌలు రైతుల శ్రేయస్సు పరిరక్షణ చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. వీరికి సంస్థాగత ఋణాలు వారి పంటలకు గిట్టుబాటు ధరలు కౌలు విధానాలు సరళీకరణ చేయబడడం కౌలు కాలపరిమితి దీర్గకాలం కొనసాగించగలిగినప్పుడే వారు పంట సాగుపై చిన్న చిన్న పెట్టుబడులు పెట్టగలిగి అధిక ఉత్పత్తి సాధించగలరు. అప్పుడే వారి ఆదాయాలు పెరిగి అధిక ఋణభారం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి ప్రక్రియలో వారు స్వయం సమృద్ధి సాధించగలరు. ఫలితంగా భారతదేశపు గ్రామాలను నేడు కుదిపేస్తున్న రైతుల ఆత్మహత్యలు నివారింపబడతాయి. అప్పుడు గ్రామీన భారతం స్థిర సమ్మిళిత ఆర్ధికాభివృద్ధి పథంలో పయనించి వేగంగా పెరుగుతున్న దేశ అధిక జనాభాకు కావాల్సిన ఆహార భద్రతను కల్పించగలరు.
పేజీలు : 124