ఆంధ్రబౌద్ధం అనే విషయాన్ని చారిత్రక దృష్టితో పరిశీలిస్తే అనేక ఆసక్తికర చారిత్రకాంశాలు వెలుగులోకి వస్తాయి. ఆంధ్ర పదం అంధక పేరుతో ప్రాకృత, పాలీ సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది.  అంధక అనే ప్రాకృత భాషా పదమే ఆంధ్రగా వ్యాప్తిలోకి వచ్చింది. వైదిక మత సాహిత్యంలో ఆంధ్రులు మ్లేచ్ఛులు, అనార్యులు. అంధకులు, ఆంధ్రులు ఒక్కరేనా అనే విషయంలో చరిత్రకారుల మధ్య వివాదం ఉన్నా, వీరిద్దరు ఒక్కరేనన్న వానవైపు ఎక్కువమంది చరిత్రకారులు మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ పదబంధంలోని ఆంధ్రకు బౌద్ధ సాహిత్యంలోని అంధక పదమే మూలాధారమైంది. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించి ఐదు దశాబ్ధాలవుతున్న సందర్భంగా, టిబెట్‌ బౌద్ధుల కాలచక్ర తంత్ర మ¬త్సవం ఒకనాటి ఆంధ్ర నగరిగా ప్రసిద్ధి చెందిన అమరావతిలో జరగడం ఆంధ్రులంతా ఆనందించదగిన విషయం.

Pages : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good