భీమవరం డి.యన్‌.ఆర్‌.కాలేజీలో లెక్కల లెక్చరర్‌గా పనిచేసిన శ్రీ రాజు గారు అదే కాలేజీలో డిగ్రీ స్థాయి వరకు చదివారు. బెనారసు హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎం.యస్‌.సి. (గణితశాస్త్రం) డిగ్రీ పొందారు. శ్రీ రాజు గారు గణిత విజ్ఞానంలో స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారు. గణితం ఆబాలగోపాలం హాయిగా నేర్చుకునేందుకు ఎన్నో నూతన ప్రక్రియలను రూపొందించారు. టి.వి.లోనూ, రేడియోలోనూ, లయన్స్‌, రోటరీ సమావేశాలలోనూ, విద్యాసంస్థలలోనూ నూతన పద్ధతుల ద్వారా గణితం మీద ఆసక్తి కలిగించుటకు ప్రయత్నిస్తున్నారు. దేశమంతటా అనేక సదస్సులలో పాల్గొన్నారు. యు.జి.సి. ప్రోగ్రామ్స్‌ ద్వారా గణితంపై అనేక ప్రోగ్రామ్స్‌ యిచ్చారు. ప్రస్తుతం అమెరికాలో వుంటూ గణితశాస్త్రంలో ఉపన్యాసాలు, ప్రసంగాలు, పరిశోధనలు చేస్తున్నారు.
అత్యంత ప్రజాదరణ పొందిన వీరి రచనలు ...... 1) అంకెలతో ఆటలు, 2) గణిత విజ్ఞానము, 3) చేతివ్రేళ్ళే కంప్యూటర్లు, 4) అందరికీ గణితం  5) వేద గణితము

Write a review

Note: HTML is not translated!
Bad           Good