''చిన్నా !''

''నన్నా పేరుతో పిలిచి ప్రలోభపెట్టకు. చెప్పు - నా తండ్రెవరు?

నిజం చెప్పు.''

అనుకోని ఈ ప్రశ్నకు అంజనీదేవి తెల్లబోయింది. ముఖం పాలిపోయింది. తనను సంబాలించుకొంది. ''ఏమిట్రా! పిచ్చిపట్టిందా? నీ తండ్రెవరో నీకు తెలియదా?''

''పిచ్చి భ్రమలో పెంచావు. ఇప్పుడైనా నిజం చెప్పకపోతే పిచ్చిపడుతుంది.''

''మీ తండ్రి శ్రీహరిగారు.''

''కాదు...అబద్ధం... అతను రామస్వామిగారి ఇల్లరికపుటల్లుడు. నీ అందానికి దాసుడై బార్యబిడ్డలను అనాధలచేసి వచ్చిన ఘనుడు...''

                                                                    ...

కన్న కొడుకుకు సంజాయిషీగా ఆ తల్లి చెప్పిన కన్నీటి కథే ''అందని పిలుపు.''

పేజీలు : 173

Write a review

Note: HTML is not translated!
Bad           Good