నర్సరీ, ఎల్‌.కె.జి., 1వ తరగతి, వయోజన విద్యార్ధులకు ఉపయోగపడే పుస్తకం ' అందాల తెలుగు'. ఈ పుస్తకం నర్సరీ నుండి ఒకటవ తరగతి వరకు అనగా 3, 4, 5 సంవత్సరాల పిల్లలకు - అందమైన తెలుగు అక్షరాలను ఎలా దిద్దాలో, తెలుగు  భాషను ఎలా నేర్పాలో పిల్లలను స్కూళ్లో చేర్పించే ముందూ, తర్వాత ఉపయోగపడే విధంగానూ, వయోజనులు కూడా తెలుగు భాషను నేర్చుకునేందుకు పనికొచ్చే విధంగానూ ఈ పుస్తకాన్ని రూపొందించారు రచయిత పి.రాజేశ్వరరావు గారు. ఇందులో తెలుగు అక్షరాలను దిద్దే పద్ధతి, ప్రతి తెలుగు అక్షరానికి అందైమన బొమ్మ, తేలికైన చిన్న చిన్న పదాలు, కొమ్ములు, గుణింతాలు, నిత్య జీవితంలో కనబడే - కూరగాయలు, పుష్పములు, జంతువులు, పండ్లు, పిల్లల చిన్న చిన్న పాటలు, దేశభక్తి గేయాలు, వారములు, నెలలు, దిక్కులు, రంగులు, అంకెలు, ఎక్కాలు, గుణకారాలు చేర్చి 'అందాల తెలుగు' నేర్చుకోగోరే వారందరికీ ప్రయోజనకారిఆ రూపొందించారు రచయిత. ఏ భాషనైనా నేర్చుకోదలచినపుడు ఆ భాషను నిర్భయంగా చిన్న పిల్లల్లా తప్పులతోనైనా సరే ఇతరులతో మాట్లాడినప్పుడే ఆ భాష వారికి త్వరగా వస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good