ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

అందగాడు : శ్రీలక్ష్మి విసురుగా చేతిలోని తాంబూలం, అక్కడున్న బల్లమీదికి విసిరింది. ఆ శబ్దం విని భోజనం చేస్తున్న రామచంద్రం తల యెత్తాడు.

భార్య వంక చూసి కన్నుగీటి చిన్నగా నవ్వాడు.

శ్రీలక్ష్మి మూతి తిప్పుకుంది. ఆమె మెడలో వేసుకున్న గొలుసు తీసి బల్లమీద పెట్టింది.

''ఎలా వున్నాడు పెళ్ళికొడుకు?'' మజ్జిగ పోసుకుంటూ అడిగాడు.

''అందగాడు...' టపీమని జవాబు ఇచ్చింది శ్రీలక్ష్మీ.

''అందరూ మూర్ఛపోయారా ఆ అందం చూసి'' నవ్వాడు.

''మీకంత ఎగతాళిగానే వుంటుంది. వెళ్ళిచూడరాదూ'' అన్నది కోపంగా.

రామచంద్ర మాట్లాడక బోజనము ముగించి బయటికి వచ్చాడు. అతను భార్యను పలుకరిస్తే నైలెక్స్‌చీర ప్రసక్తివస్తుందని తప్పుకున్నాడు. ఇంకా బ్యాండు మేళాలు, సన్నాయి వినిపిస్తున్నాయి.....

Pages : 300

Write a review

Note: HTML is not translated!
Bad           Good