'1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను. అప్పటినుంచీ తెలుగు సాహిత్యం చరిత్ర శ్రీశ్రీ స్వీయచరిత్ర'' - అని చెప్పుకున్నారు మహాకవి శ్రీ రంగం శ్రీనివాసరావు. అట్లా అనంతం అన్నది తెలుగు సాహిత్య చరిత్రే అవుతుంది. చలసాని ప్రసాద్ కూర్పుతో ఒక పుస్తకంగా వెలువడిన 'అనంతం' ఆత్మచరిత్రాత్మక నవల. తెలుగుసాహిత్యానికి సంబంధించినంతవరకు ఈ శతాబ్దం (20వ) నాది ! అని చెప్పుకున్న శ్రీశ్రీ దాపరికాలేవీ పెట్టుకోకుండా అనంతం వ్రాశారు. సినిమాపరదాలే కాకుండా సెక్సు సరదాలు కూడా ఇందులో ఉన్నాయి. తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయం వైపుకు మళ్ళించిన శ్రీశ్రీ ఆత్మకథ అద్యంతము ఆసక్తికరం. శ్రీశ్రీ ప్రచురణలు వెలువరించిన అవంతంలో 26 శీర్షికలు వున్నాయి. శ్రీశ్రీ ముఖ చిత్రంలో వెలువడిన ఈ పుస్తకం అచ్చు కంటికి ఇంపుని కలిగిస్తుంది.
Rs.225.00
Out Of Stock
-
+