మనుషులు ఆనందానికి దూరమైపోవడానికి కారణం వారిలో తిష్టవేసిన 'మనసే'. ఆనందమే బ్రహ్మ అనీ, బ్రహ్మమే ఆనందమనీ అర్థం చేసుకోలేని స్థితికి దిగజారుస్తుంది ఈ మనసే. మనసు ఉనికి మనిషిని తనను తాను మరచిపోయేట్లుగా తయారు చేసింది. మనిషి మనసుతో ఉంటాడు. చెట్లు చేమలు, జంతువులు మనసు కింది స్థాయిలో ఉంటాయి. పూర్వకాలంలో గౌతముడు మనస్సుని అధిగమించి బుద్ధుడయ్యాడు. మనస్సుని వదిలి దేవుడయ్యాడు.
స్వానుభవంతో, జ్ఞానోదయం ద్వారా తెలుసుకున్న జీవిత సత్యాల నుండి జనించిన ఆధ్యాత్మిక జీవన మార్గం అత్యంత విశిష్టమైనది. జ్ఞానోదయం పొందిన అనేక ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాల సారానికి చక్కని ప్రతిబింబమే వారు ప్రవేశ పెట్టిన జీవన శైలి. ప్రకృతి ధర్మాలతో పెనవేసుకుపోయిన వారి శైలి అత్యంత సులభమైనదీ, ఆచరణీయమైనదీ. వారు చూపే పద్ధతులు సామాన్య ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూనే సులభంగా ఆచరించదగ్గవి. లౌకిక జీవితంలోని ఆనందాన్ని, ఔన్నత్యాన్ని, శోభను, మహాత్మ్యాన్ని అనుభవిస్తూనే ఆధ్యాత్మికంగా పరిణతి సాధించగలగడమే ఈ జీవనశైలిలోని విశిష్టత.ఈ బోధనలు కేవలం వినడమే కాదు, ఆచరించి స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రాధాన్యాన్నిస్తారు.
Pages : 160