జీవితంలోని కుటుంబం, వృత్తి, సంబంధాలు, బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వహించడంలో, అలాగే ఒత్తిడి, దుర్ఘటనలు వంటి వివిధ జీవిత పరిస్థితులను నెగ్గుకురావడంలో తలమునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఒక సమర్పణ! ఒక వ్యక్తి తన జీవితాన్ని హుందాగా, సునాయసంగా జీవించటానికి కావలసిన చిట్కాలను, లోగుట్టులను అందించే పుస్తకం ఇది.

సద్గురు తన ప్రగాఢ జ్ఞానం, వాడి తర్కాలకు ఆసక్తికరమైన పిట్టకథలను, హాస్యోక్తులను జత చేసి ఇచ్చిన సందేశౄల సంకలనమే ఈ పుస్తకం. సద్గురు ఈ సందేశాల ద్వారా మన రోజువారీ సమస్యలకు సరికొత్త పరిష్కారాలను చూపుతూ, ఆ సమస్యల పట్ల మనకున్న పాతకాలపు దురభిప్రాయాలను నిర్ధాక్షిణ్యంగా త్రుంచి వేస్తున్నారు.

జీవితాన్ని అన్ని విధాలుగా శోధించి, సంపూర్ణంగా అనుభవించమని ఈ పుస్తకం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించడానికీ, తన లక్ష్యాలను చాలా సునాయసంగా సాధించడానికీ దోహదపడే సరళం, శక్తిమంతమైన రెండు సాధనలు (ఈశా క్రియ, కల్ప వృక్ష ధ్యానాలు) ఈ పుస్తకం చివరలో అందించబడ్డాయి. జాతి, మత, కుల, భాషా భేధాలు లేకుండా అందరికీ కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికతనైనా ఈ పుస్తకం అందిస్తుంది.

ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికీ, ప్రేమ, వెలుగు, ఆనందాలతో నిండిన ప్రపంచాన్ని సృష్టించడానికి ఈ పుస్తకం ఒక ప్రేరణ అవుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good