స్వామివారు తిరుపతి కొండల్లో తలదాచుకు వచ్చారని తెలిసి ఆయుధాలతో సేవించవచ్చిన ముప్పది రెండు గ్రామప్రజలతో బాటు, మరో ఎనుబది నాలుగు గ్రామాలు ఆ ఊరేగింపులో పాల్గొని స్వామివారితో బాటు శ్రీరంగానికి వచ్చేశాయి.

ఆ వార్త చక్రవర్తి వార్తాహరుల ద్వారా ముందుగానే తెలుసుకున్న శ్రీరంగం పౌరులు వైకుంఠం మాదిరి అలంకరించారు తమ పట్టణాన్ని మేళతాళాలతో, పూర్ణకుంభాలతో ఘన స్వాగతం ఇచ్చారు.

'వైష్ణవ మత ప్రచారానికి మేము స్వయంగా బయలుదేరినప్పుడు కూడా ఇంతటి జనసందోహాల్ని ఏనాడూ చూడలేదు. అమాయకులైన గ్రామీణుల్ని చైతన్యపరచి, వారిలో దైవం ఎడల భక్తిని, ఐకమత్య భావనను ఉద్దీపింపచేయటం కోసమే తనకు తానుగా దొంగలపాలు అయ్యాడు మన స్వామి'' ఆనందభాష్పాలు అదేపనిగా బుగ్గల మీదికి జాలువారుతుండగా, శ్రీధరునితో అన్నారు రామానుజులవారు.

మంత్రిసామంతులందరూ చూస్తుండగా, కావేటిరంగని సమక్షంలో వారెవరూ ఊహించని ఒక ప్రకటన చేసాడు కులోత్తుంగ చోళ చక్రవర్తి రాజేంద్ర దేవుడనే నామం కల తను, కులోత్తుంగ చోళుడిగా మారిపోయినట్లు ధునుర్దాసుడనే నామాన్ని శ్రీధరుడికి స్వయంగా ఎన్నిక చేశాడు.

''ఈ రోజు నుంచీ శ్రీరంగం చుట్టుపట్ల ఉన్న సహస్ర గ్రామాలకు రాజప్రతినిధిగా నియమిస్తున్నాను. కావేటి రంగని ఆలయ సంరక్షణ బాధ్యతలతోపాటు, వైష్ణవ మత నిర్వహణ కార్యక్రమాలను కూడా నువ్వే స్వీకరించాలి'' అని ఆజ్ఞలు జారీ చేశాడు.

రామానుజులవారు స్వయంగా ద్వయమంత్రాన్ని శ్రీధరునికి, హేమసుందరికి ఉపదేశించి వారిని ధన్యుల్ని కావించారు.

వైష్ణవం అంటే ప్రేమించే విధానాన్ని తెలియచేసే మతమని, సర్వజనుల్ని సర్వజీవుల్ని భగవత్స్యరూపంగా భావించే మనిషే నిజమైన వైష్ణవుడనీ బోధించి అందరి మన్ననలకు పాత్రుడు అయ్యాడు శ్రీధరుడు. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ధనుర్దాసు జీవిత గమనాన్ని 'ఆనందజ్యోతి' నవలా రూపంలో ప్రకటించారు మధుబాబు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good