అతను వచ్చి నాకు ఎదురుగా, సమీపంలో నిల్చున్నాడు. స్థిరంగా నా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు - ''ఎస్‌. ఐ లవ్‌ యూ !''

నా కళ్ళు తిరుగుతున్నాయేమో ననుకున్నాను. కంట్రోల్‌ చేసుకోవాలన్నట్లుగా కళ్ళు గట్టిగా మూసుకుని ఆధారం కోసం నేను కూర్చున్న సోఫాని.... ఆ కుషన్‌లోకి నా గోళ్లు దిగిపోతాయన్నంత బలంగా గుచ్చి పట్టుకున్నాను. అతను అదే పళంగా నన్ను లేపాడు. నా నడుము చుట్టూ చెయ్యేసి, ఎడమ చేత్తో నా తలని వంచి పట్టుకుని నా కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. నేను నా కళ్ళను తెరవనే లేదు. ఏదో స్వాప్నిక జగత్తులోకి జారిపోయినట్టు సుషుప్త్యావస్థలో ఉన్నాను. అతని గడ్డం నా చెంపకీ గరుకుగా తగిలింది. నా పెదవుల్ని తన పెదవులతో కప్పేశాడు. వద్దు అనాలనే స్పృహ కూడా నాకు లేనే లేదు....

ఆమె పేరు అహల్య. పెద్ద (?) కష్టాలేమీ లేవు, భర్తతో పొరపొచ్చాలు తప్ప. సానుభూతి కోసం బావగారితో స్నేహం చేసింది. ఫలితం ?

ఆమె పేరు అచ్చమ్మ. వేసిన తప్పటడుగుని వివేకంతో సరిదిద్దుకుంది. తన ఇల్లు చీకటిగా ఉండటానికి కారణం తను దీపం వెలిగించకపోవటమేనని తెలుసుకుంది.

ఆమె షామ్లా. స్త్రీవాదానికి ప్రతీక. జీవితం ఆమెకి స్త్రీ స్వేచ్ఛకి అసలు అర్ధం నేర్పింది !

గతం, వర్తమానం, భవిష్యత్తులకు ప్రతీకలైన ముగ్గురు యువతులు సామాజిక, నైతిక, మానసిక నిబద్ధతలను దాటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే కలిగే పరిణామాల చిత్రణ అనైతికం. స్త్రీవాదాన్ని విమర్శనాత్మకంగా చర్చిస్తూ మాస్టర్‌ రైటర్‌ యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన విశ్లేషణాత్మక నవల అనైతికం. ఇది ఆంధ్రప్రభ వీక్లీ సీరియల్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good