తనకు మార్మిక సంకేతాలు అందుతున్నాయని నమ్మే వ్యక్తికి, నేడు హద్దుల్లేకుండా పెరుగుతున్న టెక్నాలజీ ప్రపంచంలో అప్రతిభుడైపోతున్న మరో వ్యక్తికీ విశాలమైన ఆమ్‌స్టర్‌డాం విమానాశ్రయంలో ఎదురైన వింత అనుభవాల హాస్యవల్లరి ఈ నవల. వాస్తవికతతో సంబంధం తక్కువగా ఉంచుకొనే భారతీయ మనస్తత్వానికి రచయిత చేసిన భాష్యం ఇది. కఠిన వాస్తవికతను చిత్రిస్తూనే జీవితపు చలన సూత్రాలను ఈ నవల ప్రతిభావంతంగా ఆవిష్కరిస్తుంది. - ఆర్‌.వసుంధరాదేవి
ఈ నవల లోని ప్రతి వ్యక్తీ స్థానభ్రంశం చెందినవాడే! తమ తమ స్థానాలకు తిరిగి రావడం కోసం స్థానభ్రంశమైన వ్యక్తులు ప్రయత్నించే తీరును వివరించే నేపథ్యంలో, సందర్భంలో మతం, దాని పుట్టుక, ప్రాచుర్యం, ప్రభావం, దాని పర్యవసానాలను చక్కగా వివరించే రచన ఇది. పాఠకుడు సూక్ష్మంగా, తరచి తరచి, అణువు అణువును, మెల్లమెల్లగా, జాగ్రత్తగా, అప్రమత్తంగా చదవవలసిన నవల. - అడ్లూరు రఘురామరాజు

Write a review

Note: HTML is not translated!
Bad           Good