Rs.125.00
In Stock
-
+
నెల రోజుల నుంచి రాత్రిం బవళ్ళూ , అమూల్య కోసం అతని మనసు ఎంత దహించిందో ? అమూల్య అంతా తెలిసి తన తప్పు లేదని గ్రహించి కూడా వెళ్ళిపోయింది. ఎందుకు ? ఒక్కమాట ఒక్క చిన్నమాట చెప్పివుంటే ఇద్దరూ యంత ఆనందంగా వుండేవారు. అతని మనసు ఆక్రోశించింది.
అమూల్యని చూడగానే చెట్లు చాచి దగ్గరకు లాక్కోవాలని అనుకున్నాడు. ఒకక్షణం కూడా ఇక వదిలి వుండేది లేదు అని చెప్పాలని పించింది. ఏదో పనిమీద కలిసిన పెద్దమనుష్యల్ల్లా ముభావంగా వుంటున్నారు. అతనికి ఇక సహనం సదిలిపోసాగింది. లోపలి రండి అన్నది. మనో లోపలి వచ్చాడు. అతనికి చిత్రం గా వున్నది. సంతోషంగా కూడా వున్నాది .
ఇంతలో వరుణ్ పరుగెత్తుకు వచ్చాడు. మనోజ్ మెడ కౌగలించు కున్నాడు. అమ్మో నువ్వు వేల్లిపోయావేమోనని నాకు భయ్యం వేసింది. అంటూ మనోజ్ బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. అట్లా అయితే నువ్వు చెప్పేదే నిజం అయితే, శివా చనిపోయిన వెంటనేనా దగ్గరకు ఎందుకు రాలేదు. రెండున్నర సంవత్సరాలు ఒంటరిగా నేను, నేనుగా బ్రతకగలనేమో అని ప్రయత్నించాను. దాదాపు శక్తిని మించి పోరాడాను. కాని నా వాల్ల కాలేదు . మీ దగ్గరకు రాక తప్పలేదు. ఎంత ధైర్యం ఉన్న ఆడపిలలైన ఈ సమాజంలో ఎడుర్కొలేనివి చాలా వున్నాయి. అందుకే మీ దగ్గరకి రాక తప్పలేదు
అపురూప సంఘటనలతో , హృదయానికి హత్తుకునేలా మలచిన శ్రీమతి యద్దనపూడి సులోచనా రాణి గారు రాసిన అపురూపమైన నవల ఆమృతధార.