సకల సృష్టికి అమృత ప్రదాయని మాస్టరు సి.వి.వి గారి యోగవిధానము. అత్యంత మహామహిమాన్వితమైన ఈ నూతన యోగలక్ష్యము సృష్టిలోని లోపములను చక్కదిద్ది మానవుడు తనను తాను శాశ్వతునిగా తెలియజేసి గుర్తింపచేసి అనుగ్రహించేదిగా ఉంది. మాస్టరు సి.వి.వి. గారు తమ లక్ష్యసాధనకు సీష్టి రహస్యములను తెలుసుకొనుటకు, తెలియపరచుకు అకుంఠిత దీక్షతో సాధనా మార్గాన్ని తాము అవలంబిస్తూ తనచుట్టూ ఉన్నవారిని ఇందులో భాగస్వాములను చేశారు. ఇందులో భాగంగా మాస్టరు గారు అమూల్యమైన అతీంద్రియ సమాచారాన్ని ఎమ్.టి.ఏ. లెవెల్ నుండి పొంది అలా అందిన సమాచారంలో కొంత అక్షరబద్ధం చేయటం జరిగింది.
ఆదిశక్తి
సృష్టి అనేది శక్తి యొక్క వ్యక్తరూపంగా మనచేత భావన చేయబడుతుంటుంది. ఈ శక్తి అనేది తన ఉనికిని గమనించని నిద్రాణస్థితి నుండి క్రమంగా స-చేతనత్వాన్ని పొంది ఆ చైతన్యానికి తాననుకొన్న సాకారతను అందించటంతో సృష్టి మొదలైందని అనుకోవచ్చు. అలా ఆదితత్త్వములో అనాదిగా యిమిడివున్న ఆదిశక్తి తనలోని శక్తిని బయటకు వ్యక్తం చేయాలనుకోవటమే సృష్టి అని మనచే భావించబడేదానికి మొదటి కారక, కారణ, కార్యాలయ్యాయి. ఆదిశక్తిలో అంతర్నిహితంగాను, అబేధ్యంగాను వున్న ఆదితత్వమే అంతర్లీనంగా సమస్త సృషఙ్టలోను ఉన్నది. కాని తనను సృష్టిగా మలచుకోవాలన్న సంకల్పం సరాసరి ఆదితత్త్వము నుంచి కాక ఆదిశక్తి నుండి వెలువడింది. (మనలను మనం గమనించుకొన్నా కూడా మనలోని నేను వేరు మనలోని శక్తి వేరు అదే భావం సృష్ట్యాదిలోను ఉన్నది),
పేజీలు : 182