అమ్మమ్మ అక్షరాలు నేర్పించమని కూచుంటే నువ్వేం చేస్తావు? భారత రాష్ట్రపతి నిన్ను రైలులో తనతోబాటు తీసుకుపోతే ఎలా ఉంటుంది? నువ్వు తప్పుగా రాసిన సమాధానానికి నీ టీచరు మార్కులేస్తే నువ్వేం చేస్తావు? ఇవే కాదు, తరచు స్కూలెగొట్టే విద్యార్ధి హృద్యమైన కథ!

అవసరానికాదుకున్న అమ్మ పెళ్ళినాటి సలహా! చిన్న అమ్మాయి తాతగారికిచ్చిన మాట పెద్దై నిలుపుకున్న వైనం! నీ కలల సాకారానికి కావాల్సిన ధైర్య! పిన్నిలకు, పెద్దలకు దిశా నిర్దేశంక్ష్మ!

''చదువు లక్ష్యం శీల నిర్మాణం'' అన్న ప్రాధమిక సూత్రానికి నిర్వచనం ఈ కథలు. కుట్రలు, కుతంత్రాలు, బాధలు, వేదనలు లేని ఆరోగ్యవంతమైన ఉజ్వల జీవితానికి అద్దంపట్టే కథలు ఇవి!

సలలితంగా సందేశం...కల్పిత కథానికలు కావు, స్వీయానుభవాల నుంచి జాలువారిన ముత్యాల సరాలు. - ఇండియా టుడే

జీవితంలో తాను స్వయంగా ఎదుర్కొన్న అనేకానేక సమస్యలకు అనుభవపూర్వకంగా నిర్మాణాత్మక సమాధానాలు సూచించే కథల్లాంటి రచనలు ఇవి. ఈ ఆత్మకథాత్మక కథనాలలో మనావతా పరిమళాలు గుబాళిస్తాయి. - ప్రజాసాహితి

Write a review

Note: HTML is not translated!
Bad           Good