ప్రతినిత్యం మనం తినే ఆహారంలోనే వ్యాధినిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడే అనేక ములికలను ప్రవేసపెట్టారు మన పూర్వికులు. అమ్మమ్మలు, నానమ్మలు, ముదుసలి మేనత్తలు ఈ ములికలను సర్వసాధారణంగా వచ్చే వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తూ వచ్చారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ చిన్నభిన్నమైంది. దాని స్ధానంలో నుక్లియర్ ఫ్యామిలి వ్యవస్ధ వచ్చింది. కొంపకి పెద్దదిక్కే కరువైంది. ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తిన వెంటనే పెద్ద హాస్పిటల్ కి పరుగులు తీస్తున్నారు. ఇంట్లో ఉండే "అమ్మమ్మ మందుల సంచి"గా పిలవబడే పోపుల పెట్టెని మర్చిపోయారు. కనుమరుగవుతున్న ఈ విజ్ఞానాన్ని పరిరక్షించాదాన్ని ప్రయత్నించారు ప్రస్తుత గ్రంధ సంకలనకర్తలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good