ప్రతి విద్యార్థి అంబేద్కర్‌ వైపు చూడండి... నిశితమైన గ్రహణశక్తితో తన కాలానికంటే ముందుండేవాడు.... జరగబోయే విషయాలను ఖచ్చితంగా అంచనా వేసేవాడు. ఆయన ఆలోచనా విధానం తప్పు అని ఎవ్వరూ ఇప్పటికీ అనలేరు... అంతటి నిఖార్సయిన ప్రజ్ఞాపాటవాలు నిజంగా బూడిద పాలై పోతున్నాయి... అపాత్రదానమై పోతున్నాయి... ఈ దేశంలో నిజంగా ప్రతీ భారతీయుడు విచారింపవలిసిన సమయం ఆసన్నమయింది.. ఆయన 125వ జయంతి సందర్భంగా ''అంబేద్కర్‌ డిక్షనరీ''లో ఒక్క వాక్యం... కనీసం ఒకే ఒక్క వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం...

అది ఏమిటంటే - ''వ్యక్తి భవితవ్యం కంటే జాతి భవితవ్యం ముఖ్యమైనది. జాతికంటే సంఘం, అన్నిటికన్న దేశం ముఖ్యం'' - ఇది అంబేద్కర్‌ యొక్క ఆలోచనా స్రవంతి.. ఇటువంటి స్వార్థరహిత, స్ఫటికం లాంటి దేశభక్తి గలవారు... ఆచరించి చూపేవారు. ఒక్కరంటే ఒక్కరు మన వర్తమాన భారతంలో కన్పించరు. అదేమి శాపమో ఇంకొక అంబేద్కర్‌ పుట్టనే లేదు...

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good