'నన్ను అనవసరంగా కొడ్తావెందుకూ? నేనేమైనా జాడీ కావాలని పగుటగొట్టానా? అది పగిలిపోవాలని నేను కోరుకుంటానా?'' అన్నాడు రోషంగా, ఆ జవాబుకు తిరుపతయ్య ఆశ్చర్యపోయాడు. అనంతుడు ఏడుపు మొహం పెట్టి ''మీ పెద్దవాళ్ళంతా యింతే! ఎప్పుడూ పిల్లల మీద అధికారం చెలాయించాలని చూస్తారు! పచ్చడి జాడీ నేను పగులకొట్టాను కాబట్టి ఎందుకు పగులగొట్టావంటూ కొట్టావు. అదే నువ్వు పగులగొట్టి ఉంటే, ఆ జాడీ దారిలో ఎందుకు పెట్టావంటూ అమ్మను కోప్పడేవాడివి! అన్నాడు. తిరుపతయ్యకు ఎవరో చెళ్ళున చెంప మీద చరిచినట్లనిపించింది. పెద్దల ప్రవర్తనే పిల్లలకు ప్రభావితం చేస్తుందని చెప్పే కథ సన్మార్గం. పెద్దలు తప్పులు చేయకూడదు. ఒక వేళ చేసినా తప్పును ఒప్పుకోవాలి. తప్పును తెలివిగా సమర్ధించుకుంటే దాన్నే పిల్లలూ నేర్చుకుంటారని చెబుతుంది ఈ కథ. దీంతో పాటు ఈ సంపుటిలో 22 పిల్లల కథలు ఉన్నాయి. అమ్మమనసు, మాట నేర్పరి, చెప్పుడు మాటలు, లౌక్యుడు, అసలు దొంగ, బాకీ వసూలు, అల్లుడైన కొడుకు, వైద్యుడి పొగరు, ఆత్మగౌరవం వంటి కథలు యిందులో కనిపిస్తాయి. మంచి వినోదంతో పాటు చక్కటి నీతిని బోధిస్తాయి ఈ కథలన్నీ. అన్ని కథలకీ మంచి బొమ్మలు ఉన్నాయి. సరళమైన తేటతెలుగులో సాగిపోయే ఈ కథలు పెద్దలు పిల్లలకి చెప్పటానికీ, పిల్లలే చదువుకోవటానికీ బాగుంటాయి. రచన దాసరి వెంకటరమణ. దీనికిది రెండవ ముద్రణ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good