"వెన్నెముక లేని తరం మాది. చీమూ నెత్తురూ లేని జీవితాలు మావి. మా మెదళ్ళన్నీ లాభ నష్టాల లెక్కలలో నిండిపోయాయి. గుప్పెడు పాపిష్టి డబ్బు కోసం మాన మర్యాదల్ని అమ్మేసి, నిరర్ధకమైన కృత్రిమ వస్తు ప్రపంచానికి బానిసలమై మానవత్వాన్ని పాతాళపు అడుగు పొరల్లో కప్పెట్టేసి, అన్నం పెట్టే అమ్మనే ఖండ ఖండాలుగా చేసి, అద్దాల మేడ కోసం అర్రులు చాస్తూ, వికృత రూపం దాల్చిన భారతీయ భావ బానిసలకు సరికొత్త నమూనాలం మేం! బ్రతికి ఉన్న పీనుగులం. మమ్మల్ని మా ప్రజల్నీ పీక్కు తినండి "బాబూ" అంటూ విదేశీ రాబందుల్ని మళ్ళీ మళ్ళీ అడుక్కుంటూ ఉంటాం. స్టార్‌మత్తులో, డాలర్ వెర్రిలో మునిగి అమెరికా పిచ్చిలో పరిగెత్తుతూ ఉంటాం. పల్లె సీమల్ని భస్మీపటలం చేసి, సరికొత్త ధనారణ్యాలను సృష్టిస్తాం. రంగులు మార్చే అభినవ ఊసరవెల్లులం మేం!! ప్రపంచ బ్యాంకులకి బాకాలూదుతూ, మా రైతుల రక్తాన్ని జలగల్లా జుర్రుకుంటున్న సరికొత్త తెలుగు నియంతల తాబేదార్లం. మహా మేధావులం మేం! అంతర్జాతీయ పరిణామాలపై, హింసపై, మధ్య తరగతి కోరికలపై, కుహనా ఆనందాలపై చర్చిస్తూ, ఖండిస్తూ జీవితాన్ని నడిపేస్తాం. మీకు తెలుసా?? ప్రజల పోరాట జ్వాలలతో ఆవిరిగా మార్చితే తప్ప శుద్ధిగాని మురుగు కాల్వలం మేమే!!"
- రవి, ప్రజాసాహితి

Write a review

Note: HTML is not translated!
Bad           Good