పండితునిగా, న్యాయవాదిగా, ఆర్ధికవేత్తగా, మేధావిగా అంబేద్కర్‌ జీవితంలోని వివిధ కోణాలను నవతరం పాఠకులకు అందించే ప్రయత్నమిది. ఒక జాతీయ నాయకునిగా,దళిత నేతగా అణగారిన వర్గాలకు ఆరాధ్యునిగా అంబేద్కర్‌ ఆరోహణ క్రమాలకి అక్షర రూపమిది.

అట్టడుగు వర్గంలో పుట్టి, నిచ్చెనమెట్ల సమాజాన్ని ఎక్కుతూ తన మార్గాన్ని సరైన దిశలో మలచుకుంటూ రాజ్యాంగ నిర్మాతగా, దళితవర్గాల బానిస విమోచకుడిగా అంబేద్కర్‌ ఎదిగినవైనాన్ని ఆమె కళ్ళకు కట్టినట్లు వివరించారు. హిందూమతాన్ని విడనాడి, బౌద్ధునిగా మారిన అంబేద్కర్‌ హిందువులకు వ్యతిరేకమనే భావనను, 'మేం బ్రాహ్మణత్వానికి మాత్రమే వ్యతిరేకంకానీ బ్రాహ్మణులకు కాదు' అన్న అంబేద్కర్‌ ఆలోచనావిధానాన్ని రచయిత్రి స్పష్టం చేశారు. - వార్త

బహుముఖీనమైన ప్రతిభతో అస్పృశ్యతను రూపుమాపటం కోసం అంబేద్కర్‌ సాగించిన పోరాటాన్ని ఆర్ధ్రతతో పాఠకుల కళ్ళకు కట్టిన గెయిల్‌ అంవెట్‌. సరికొత్త స్ఫూర్తి కోసం, జీవన వికాసం కోసం తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం. - ఈనాడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good