అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా సామాజిక రంగంలో అంబేద్కర్ కృషి గురించి గానీ, సామాజిక సమస్యల పరిష్కారం గురించి గానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ దళితులు, గిరిజనుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు అంబేద్కర్ జయంతి పేరుతో పాలకులు అంబేద్కర్ సేవలను కొనియాడుతుండగానే, మరోవైపు అగ్ర కుల పెత్తందారీ దాడులు తీవ్రమవుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గానీ సిపిఐ (ఎం), వామపక్షాల ఆధ్వర్యంలో కులవివక్షకు వ్యతిరేకంగానూ, సామాజిక సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న కృషి అందరినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే మార్క్సిస్టులూ, అంబేద్కరిస్టులూ కలిసి పని చేయవల్సిన ఆవశ్యకత గురించి కూడా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సామాజిక రంగంలో కృషి గురించి సిపిఐ (ఎం) నాయకులు, మేధావులు రాసిన వ్యాసాలు, చేసిన ఉపన్యాసాలలో కొన్ని ఎంపిక చేసి ఈ చిన్న పుస్తక రూపంలో అందించారు.
Pages : 112