స్వేచ్ఛ

మనిషి మనసుకుగల స్వేచ్ఛయే నిజమైన స్వేచ్ఛ. మనసుకి స్వేచ్ఛ లేని మనిషి అతడు సంకెళ్ళలో బంధింపబడనప్పటికీ అతడు నిస్సహయుడే, బానిసే. మనసుకి స్వేచ్ఛ లేని మనషి జైలులో లేకపోయినా జైలులో వున్నట్టే.

ఎవరైతే, తనకు గల హక్కుల్ని గురించి ఎరుక కలిగి వుంటారో, ఎవరైతే తనకు గల బాధ్యతలు, విధులు గుర్తించి వుంటారో, ఎవరైతే పరిస్థితులను తనకు అనుగుణంగా మలచుకోగలిగి వుంటారో వారే స్వేచ్ఛా జీవులు. ఎవరైతే ఆచార వ్యవహరాలలో బానిసలాగా లొంగిపోకుండా, పురాతనం నుండీ వస్తున్నాయి అని వాటిల్ని ప్రశ్నించకుండా వుండకుండా వుంటాడో అతడు 'స్వేచ్ఛ గల మనిషి'.

ఎవరైతే తన స్వార్థానికి తాను లొంగిపోకుండా, ఎవరో ఏదో చెప్పారు, వాటిల్ని పాటించాల్సిందే అనుకోకుండా, దేనినైనా లోతైన పరీక్ష చేసి దాని నిగ్గు తేల్చితే తప్ప దానిని నమ్మకుండా, కార్యాకారణ ఫలితాల దృష్టితో యోచిస్తూ జీవించగలడో అతడే 'స్వేచ్ఛ గల మనిషి'. - డాక్టర్‌ బాబాసాహెబ్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌

పేజీలు :264

Write a review

Note: HTML is not translated!
Bad           Good