18-19 శతాబ్దాల సంధి కాలంలో ఆంధ్రదేశంలోని ఒక ప్రముఖ సంస్థానాధీశుడి జీవిత చరిత్ర ఇది.

భారతీయ సమాజంలో భాగంగా, ఆంధ్రదేశంలో భూస్వామ్య వ్యవస్థ బలంగా వేళ్లూనుకొన్న దశ ఈ గ్రంథ నేపథ్యం. కానీ, ఆ వ్యవస్థ క్రమేపీ కదలబారుతూ, మార్పులకు లోనవుతున్న సందర్బం. కారణం, అప్పటికే పరాయి పాలన క్రమంగా బలపడుతూ వచ్చి, దేశాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నది. 'సంపద తరలింపు' వారి ప్రధాన ధ్యేయం. దేశవాళీ రాజకీయాల్లో జోక్యం చేసుకోడం, విభజించి పాలించడం, ప్రతిఘటనలను అణచి వేయడం ద్వారా తమ పబ్బం గడుపుకోడం, స్థూలంగా కంపెనీ పాలనలోని ముఖ్యాంశం. అదొక సంధి దశ. శాశ్వత శిస్తు విధానం ద్వారా దేశీయ సంస్థానాలను, చిన్నా పెద్దా జమీలను బలహీనపరచి, వాటి అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొని, క్రమేణా వాటిపై ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రక్రియ కొనసాగుతున్న సందర్భం. గ్రంథకర్త పొత్తూరివారు, యీ సంక్లిష్ట పరిస్థితులను, దేశరాజకీయ దృశ్యం, చారిత్రక నేపథ్యాల ద్వారా సమగ్రంగా వివరించారు.

Pages : 214

Write a review

Note: HTML is not translated!
Bad           Good