మహాత్మాగాంధీ ప్రియశిష్యుడు, ప్రముఖ గాంధేయవాది శ్రీ పొట్టి శ్రీరాములు. ఇంజనీరింగ్‌ చదివి రైల్వే ప్లంబర్‌గా బొంబాయిలో ఉద్యోగం చేశాడు. పత్ని, పుత్ర, మాతృవియోగంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న శ్రీరాముల్ని, దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ నడుపుతున్న పోరాటం ఆకర్షించింది. సూరత్‌లో గాంధీని కలిసి తన వీరాభిమానాన్ని చాటుకొన్నాడు. గాంధీజీ సమ్మతితో ఉద్యోగానికి రాజీనామా చేసి సబర్మతీ ఆశ్రమానికి చేరాడు. అక్కడ కఠోర దీక్షను, ఆదర్శవంతమైన జీవితాన్ని ఆరంభించాడు. నిర్మాణ కార్యక్రమాల్లో పాలుపంచుకొన్నాడు. గాంధీజీతో పాటు సత్యాగ్రహాల్లో పాల్గొని జైలుకు వెళ్ళాడు. శ్రీరాములులో అకుంఠిత దీక్ష, హరిజనోద్ధారణ, జాతీయతాభావం పెల్లుబికింది.

సబర్మతీ ఆశ్రమం నుండి నెల్లూరు తిరిగొచ్చి హరిజనోద్ధరణకు నడుం బిగించాడు. మద్యపాన నిషేధం కోసం, పరిశుభ్రత కోసం ప్రచారం చేశాడు. నిరశన దీక్ష చేసి హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించాడు. అస్పృశ్యతా నివారణకు పాటు పడుతూ అగ్రవర్ణాల వారి చేతిలో దెబ్బలు తిన్నాడు. వితంతు వివాహాలు జరిపించాడు. ఖాదీ ప్రచారకుడిగా ఇంటింటికి తిరిగాడు. హిందూ సంఘ సంస్కరణ సమితిని స్థాపించి సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టాడు. మహాత్మా గాంధీ ఆప్యాయతను, ఆశీస్సులను పొందిన అరుదైన వ్యక్తి శ్రీరాములు.

దేశ స్వాతంత్య్రానంతరం ఆంధ్రుల గుర్తింపుకోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆత్మ బలిదానం చేసుకున్న త్యాగమూర్తి శ్రీరాములు. ప్రతి తెలుగువాడూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. ఆయన జీవిత విశేషాలను ఈ తరం బాలబాలికలు తెలుసుకొనేందుకు ప్రచురించిన అమూల్యమైన పుస్తకం 'అమరజీవి పొట్టి శ్రీరాములు'.

పేజీలు : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good